APCM, వెబ్ డెస్క్:
Ration Card eKyc Overview:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డుల ఏరివేత కార్యక్రమం మొదలైంది.అందులో భాగంగా రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ దగ్గరలో ఉండే గ్రామ వార్డు సచివాలయం లేదా రేషన్ డీలర్ల వద్ద వేలిముద్ర (eKyc) పూర్తి చేసుకోవాలి లేని పక్షంలో ఎవరైతే వేలిముద్ర (kyc) వెయ్యకుండా ఉంటారో అలాంటి వారి అందరి పేర్లు రేషన్ కార్డుల నుంచి తోగించే చర్యలు తీసుకోబోతోంది కూటమి ప్రభుత్వం.
రేషన్ కార్డుదారులకు ఇదొక చేదు వార్త. రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కంటే ముందే పాత రేషన్ కార్డులో ఉన్న వారిని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి వెరిఫికేషన్ చెయ్యడం మొదలు పెట్టింది.
New Ration Card application:
కొత్త రేషన్ జారీలో భాగంగానే ఈ వెరిఫికేషన్ మొదలు పెట్టినట్లు అధికార యంత్రాంగం పేర్కొంటోంది. పాత రేషన్ కార్డులో ఉన్న వారి ఎంత మంది ఉన్న వారు వేలిముద్ర వెరిఫై చేసిన తర్వాతే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలని భావిస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో రేషన్ కార్డుదారులు ekyc ప్రక్రియ పూర్తి చేసుకోవడానికి మార్చి 31 తేదీను ఆఖరుగా ఉంచింది. ఆలోపు ఎవరైనా ekyc చెయ్యకపోతే మీ పేర్లు తొలిగిపోతాయి.
Ration card ekyc last date:
మార్చి 31వ తేదీ చివరి తేదీ. కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తేదీని నిర్ణయించాయి.
✔️Ration Card eKyc Status:
మీ రేషన్ కార్డులో మీ కుటుంబ సభ్యులకు ekyc పూర్తి (Verify) అయ్యిందో లేదో ఇక్కడ ఉన్న లింక్ పై క్లిక్ చేసి చూసుకోవచ్చు.
👇👇👇👇👇
https://epds1.ap.gov.in/epdsAP/epds

Pingback: TS Inter 1st,2nd Year Results 2025 - APCM