APCM వెబ్ డెస్క్:-
దేశవ్యాప్తంగా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి గూగుల్ పే,ఫోన్ పే, పేటియం UPI ద్వారా పేమెంట్ చేసే వారికి కొత్త మార్గదర్శకాలను (NPCI ) నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ ను అమలు చేయబోతోంది.
అయితే ఈ రూల్స్ ప్రకారం NPCI మరియు (BANKS)బ్యాంకింగ్ వ్యవస్థ రెండు కలిసి మొబైల్ నెంబర్లకు సంబంధించి ఈ మార్పులు చేర్పులు చేయబోతున్నారు.
ఇది చదవండి: రైల్వే శాఖ సంచలన నిర్ణయం.. వారికి నో ఎంట్రీ..!
ఈ రూల్స్ లో ముఖ్యంగా డిఆక్టివేటెడ్ (Deactivated) మరియు సరెండర్ (Surrender ) చేసిన మొబైల్ నెంబర్లను మార్చి 31వ తేదీ లోగా తొలగించాలని బ్యాంకులను ఆదేశించింది NPCI.
ఆ తర్వాత ఈ నెంబర్లను ఉపయోగించి ఫోన్ పే గూగుల్ పే ఇతర యూపీఐ సేవలు పొందలేరంటూ కూడా తెలిపింది. అప్డేట్ చేసిన మొబైల్ నెంబర్లను సిస్టం ఉపయోగించి ట్రాన్సాక్షన్ నంబర్స్ ఐతే ఇవ్వాలని సూచించింది.
మీరు ఈ యూపీఐ సేవలను వాడుకోవాలంటే తప్పనిసరిగా మీ మొబైల్ యాక్టివేట్ లో ఉండాలి. దానికి మీరు మీ మొబైల్ నెంబర్ ని వెరిఫై (Verify) చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మీ గూగుల్ పే ఫోన్ పే పనిచేయడం ఆగిపోతాయి.
