APCM.in | వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిటెక్నిక్ 2025 అడ్మిషన్ కొరకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల చేసింది రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ.
పదోతరగతి హాల్ టికెట్ ద్వారా ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కి అప్లై చేసుకునే అవకాశం కల్పించింది. ఏపీ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2025 అప్లికేషన్ చివరి తేదీ ఏప్రిల్ 15వ తేదీ వరకు గడువును ఖరారు చేసింది.
ఏప్రిల్ 30వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఏపీ పాలీసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది.
పదో తరగతి విద్యార్థులు ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ అప్లై చేసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ https://polycetap.nic.in వెళ్లి మీ యొక్క 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, పదో తరగతి పరీక్షలు రాసిన సంవత్సరం ఎంచుకొని, తర్వాత మీ వ్యక్తిగత వివరాలు అడ్రస్ అన్ని నమోదు చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.
కావాల్సిన డాక్యుమెంట్స్:
- 10th Class హాల్ టికెట్
- మొబైల్ నెంబర్
- SC/ST/OBC Caste Certificate
- Income Certificate
- Aadhar Card
దరఖాస్తు చివరి తేదీ:
ఏపీ పాలిటెక్నిక్ అప్లికేషన్ చివరి తేదీ ఏప్రిల్ 15వ తేదీ వరకు గడువును ఇవ్వడం జరిగింది.
పరీక్ష తేదీ: ఏప్రిల్ 30వ తేదీన నిర్వహించడం జరుగుతుంది.
↗️అధికారిక వెబ్ సైట్: https://polycetap.nic.in
ఏపీ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే దానికి సంబంధించిన పాత ప్రశ్న పత్రాలు మరియు పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ మెటీరియల్ అనేవి అధికారిక వెబ్సైట్లో పొందుపరిచి ఉండడం జరిగింది విద్యార్థులు వాటిని ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని పరీక్షకు సన్నద్ధం అవ్వచ్చు.
ఇది చూడండి: ఇండియన్ ఆర్మీ 2025 ఉద్యోగాలకు నోటిఫికేషన్
