ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదలకు రంగం సిద్ధమైంది ఇప్పటికే పరీక్ష పత్రాల మూల్యాంకనం పూర్తి చేయడానికి ఏప్రిల్ 9 ని టార్గెట్ గా పెట్టుకుని వాల్యుయేషన్ అంతా కూడా పూర్తి చేస్తూ ఉన్నారు అధికారులు.దాదాపుగా 75% వరకు పరీక్ష పత్రాల మూల్యాంకనం పూర్తయింది. ఈ పరీక్ష పత్రాల మూల్యాంకనం తర్వాత విద్యార్థుల యొక్క మార్కుల వివరాలను కంప్యూటర్లో క్రోడీకరించడం జరుగుతుంది.
ఇది చూడండి: GATE ఫలితాలు విడుదల
పూర్తిస్థాయిలో పరీక్షా ఫలితాలు విడుదలకు ఏప్రిల్ 10వ తేదీ లేదా 15వ తేదీ లోపు ఫలితాలను విడుదల చేయాలని రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి టార్గెట్ పెట్టుకుంది.
అయితే గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫలితాలను విద్యార్థుల వాట్సాప్ నెంబర్ కి పంపించే విధంగా ప్రాణాలికలు కసరత్తు చేస్తున్నారు అధికారులు దీనికోసం ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ కూడా రూపొందించడం జరిగింది. ఈ వాట్సాప్ ద్వారా మీ ఇంటర్మీడియట్ ఫలితాలను తెలుసుకోవడానికి సులువుగా తక్కువ టైంలో రిజల్ట్స్ ను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్ సైట్ లో ఫలితాలను కూడా ఉంచుతారు.
అక్కడ ఎక్కువ మంది విద్యార్థులు ఒకేసారి తమ రిజల్ట్స్ చెక్ చేసుకునే దానిలో వెబ్సైట్ పై లోడ్ పెరగడంతో ఫలితాలు అనేవి చూసుకోవడానికి కొంత సమయం పడుతుంది, అదే వాట్సప్ ద్వారా అయితే మాత్రం మీకు వెంటనే ఫలితాలు విడుదలై మీ మొబైల్ పై వచ్చేస్తాయి అంటుంది ప్రభుత్వం.
ఇప్పుడు ఉన్న సమాచారం మేరకు గతంలో ఉన్న ట్రెండు చూస్తే 2022లో మే నెలలో ఫలితాలు విడుదలయ్యాయి, 2023లో ఏప్రిల్ ఆఖరు ఫలితాలు విడుదలయ్యాయి, 2024లో ఏప్రిల్ రెండో వారంలో ఫలితాలు విడుదలయ్యాయి, ఇక ఇప్పుడు 2025లో ఏప్రిల్ రెండో వారంలోనే ఫలితాలు విడుదలకు అవకాశం కనిపిస్తుంది.
