ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం వేగవంతంగా జరుగుతోంది. రాష్ట్ర విద్య మండలి అనుకున్నట్లుగానే ఏప్రిల్ 9వ తేదీలోగా పరీక్ష సమాధాన పత్రల మూల్యాంకనం పూర్తి చేసేటట్లు అధికారులు, ఉపాధ్యాయులు వేగవంతంగా ప్రక్రియను పూర్తి చేస్తున్నారు.
ఒక్కొక్క ఉపాధ్యాయుడు రోజుకి 35 నుంచి 45 సమాధానం పత్రాలను మూల్యాంకనం చేస్తూ ఉన్నారు. దాదాపు ప్రక్రియ అనేది పూర్తి కావడానికి వచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నట్లుగానే ఈ వాల్యుయేషన్ ప్రక్రియ ఏప్రిల్ 9వ తేదీన ముగిసినట్లయితే ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలను ఏప్రిల్ చివరి వారం లేదా మే నెల మొదటి వారంలో విడుదలతకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లే అవుతుంది.

ఈ ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం వాట్సప్ ద్వారా విడుదల చేయాలని కూడా చూస్తూ ఉంది వాట్సాప్ నంబర్ 95523 00009 ని కూడా మీరు మీ యొక్క మొబైల్లో సేవ్ చేసుకున్నట్లయితే రిజల్ట్ ని తెలుసుకోవడం చాలా సులభతరం.
ఈ సంవత్సరం ఈ ఫలితాలను మూడు విధాలుగా పొందేందుకు ఏర్పాటు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం అందులో మొదటి విధానం ఆన్లైన్ లో మరియు ఎస్ఎంఎస్ రూపంలో అదే విధంగా వాట్సాప్ ద్వారా మీ ఫలితాలను నేరుగా మీ మొబైల్ లోనే పొందవచ్చు.
Pingback: TS Inter 1st,2nd Year Results 2025 - APCM
Me