APCM వెబ్ డెస్క్:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబర్ నెల నుంచి ఆగిపోయిన కందిపప్పు పంపిణి రాష్ట్ర ప్రభుత్వం మరల ప్రారంభించబోతోంది. బయట బహిరంగ మార్కెట్లో కేజీ 100 నుంచి 120 రూపాయలు అమ్ముడుపోతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది.
వీటిని రేషన్ షాపుల్లో కేజీ ధర ₹67 రూపాయలకే అందించబోతుంది. ఈ కందిపప్పు పంపిణీ ఇప్పుడు ఏప్రిల్ నెల రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయబోతోంది.
ఇది చూడండి: ఉచిత డీఎస్సీ కోచింగ్ వెబ్ ఆప్షన్ ఎంచుకోండి
ఈ కందిపప్పు పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను పిలవబోతోంది టెండర్ల ప్రక్రియ త్వరగా పూర్తయిన వెంటనే ప్రతి ఒక్క చౌక దూకానాల్లో ఈ కందిపప్పు పంపిణీ చేస్తారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కందిపప్పు ఉత్పత్తి తక్కువగా ఉండడంతో పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక ,ఇతర ప్రాంతాల నుంచి కందిపప్పు దిగుమతి చేసుకొని సరఫరా చేసే విధంగా ప్రణాలికలు వేస్తుంది.
జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో పూర్తిగా రేషన్ లో కందిపప్పును పంపించడం నిలిపివేశారు. ఇప్పటికైనా ఏప్రిల్ నెలలో కందిపప్పును పంపిణీ చేయాలని ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
