వెబ్ డెస్క్, ఆంధ్ర ప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్లకు ఎంపిక ప్రక్రియ కొరకు అభ్యర్థుల నుంచి ఆప్షన్ ఎంచుకునే అవకాశాన్ని కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం.
రాష్ట్రంలో ఉచితంగా డీఎస్సీ కోచింగ్ కొరకు అన్ని జిల్లాల నుంచి అభ్యర్థుల దగ్గర దరఖాస్తుల స్వీకరించింది ఈ ఎమ్మెల్సీల ఎలక్షన్ కారణం చేత పరీక్ష నిర్వహణ జరగలేదు కానీ అభ్యర్థుల మార్కుల ఆధారంగా మెరిట్ లిస్టు విడుదల చేసింది.
ఇది చూడండి: గ్రూప్ -2 ఫలితాలు విడుదల
రాష్ట్ర విద్యా మండలి ఇప్పుడు ఆ మార్కుల ఆధారంగా మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులు తమకు దగ్గర్లో వీలుగా ఉండే కోచింగ్ సెంటర్లను ఎంచుకునే దానికోసం ఆప్షన్స్ ను అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది విద్యార్థులు ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే మీ పేరును మెరిట్ లిస్ట్ జాబితాలో చెక్ చేసుకుని ఫ్రీ కోచింగ్ సెంటర్ల ఆప్షన్ను నమోదు చేసుకోవాలని సూచించింది.