APCM వెబ్ డెస్క్:- ఇటీవల కాలంలో మెట్రో ప్రయాణం చాలా వేగంగా అందరికీ అందుబాటులో ఉండడంతో ఈ మెట్రో ప్రయాణంలో ఏ వస్తువులు తీసుకెళ్లాలి ? ఏ వస్తువులు నిషేధిత జాబితాలో ఉన్నాయి ? అనేది తెలియక ప్రయాణికులు, అక్కడ ఉండే సిబ్బందితో వాగ్వాదం జరగడం చోటు చేసుకుంటూ ఉంటుంది.
ఇలాంటి తరుణంలో మెట్రో సంస్థలు మెట్రోలో ప్రయాణం చేయాలంటే తప్పనిసరిగా ఈ నిషేధిత వస్తువులను మాత్రం మీ వెంట తీసుకురావద్దంటూ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసింది.అందులో ముఖ్యంగా ఈ వస్తువులు ఈ నిషేధిత జాబితాలో ఉండే వస్తువులు తీసుకెళ్లినట్టయితే మీకు జర్నీలో అవాంతరాలు లేదా టికెట్ కూడా ఇవ్వరు లాంటి ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
నిషేధిత వస్తువులు ఏంటి?
- పదునైన వస్తువులు : పదునైన కత్తులు, కత్తెర్లు చాకులు గొడ్డలి గడ్డపార
- పేలుడు పదార్థాలు: గ్యాస్ సిలిండర్ లైటర్లు గన్సు స్ట్రంగన్స్ మొదలైనవి
- మద్యం(ఆల్కహాల్) : మద్యాన్ని కూడా మెట్రోలో కేవలం రెండు సీల్ వేసినా మాత్రమే అనుమతిస్తారు
ఇది చూడండి: వరుసగా మూడు రోజులు సెలవులు
ఇక పైన చెప్పిన నిషేధిత వస్తువులే కాకుండా తుపాకులు, పెంపుడు జంతువులు, మాంసం, ఎముకలు, పాడైపోయిన కూరగాయలు, మానవులు లేదా జంతువుల రక్తం, మాంసం, జంతువుల మృతదేహాలు, సీల్ వేయని వస్తువులు, ప్యాక్ చేయని చేపలు, ఎండిన మాంసం,రంపం, కత్తి, బ్లేడ్, తుపాకీ ,పొడి, డైనమైట్ ,బాణసంచా, హ్యాండ్లూమ్స్, పేలుడు పదార్థాలు, స్పోర్ట్స్ ఎయిర్ రైఫిల్, స్టం గన్, పెంపుడు పక్షులు, యాసిడ్స్ మొదలైనవి మెట్రోలో పూర్తిగా నిషేధం.